పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అర్&అర్ పనులను వేగవంతం చేయాలని జిల్లా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసిలో మంగళవారం పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అర్&ఆర్ పనులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్&ఆర్ అవార్డ్ లను రెవెన్యూ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.