సోమవారం జరిగిన గ్రూప్-3 పరీక్షల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఓ ప్రశ్నను అడిగారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది సరైనది కాదు? అన్న ప్రశ్న వచ్చింది. గ్రూప్-3 పరీక్షలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రశ్న రావడం పట్ల భారతీయ కిసాన్ సంగ్, పలువురు జలసాధన సమితి సభ్యులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.