మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్యశాఖకు 3000 కోట్ల రూపాయలు కేటాయించి వివిధ పథకాల ద్వారా మత్స్యకారులను ఆదుకోవాలన్నారు.