జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని ఈద్గాన్పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బస్సు రాథోడ్ ఆధ్వర్యంలో ఇంటింటి కుల గణన సర్వేను గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ సర్వేను బుధవారం మండల ఎంపీడీఓ మచ్చేందర్, ఎంపీఓ వెంకట్రాములు, ఏఎస్ఓ శ్రీకాంత్ తనిఖీ చేశారు. కులగణన నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్లకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.