మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలలో రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు, పాదాచారులు, తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుపై మురుగునీరు నిలవకుండా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.