ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో ఈ ఏడాది 2. 60 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుఅవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో 1. 30 లక్షల ఎకరాల్లో ఆ తరువాత వనపర్తి జిల్లాలో 40 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.