జోగులాంబ గద్వాల జిల్లా బ్రహ్మకుమారీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్గానిక్ దినోత్సవ కార్యక్రమంలో వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భవిష్యత్తులో ఆర్గానిక్ ఫుడ్ కు చాలా ప్రధానత ఉంటుందని తెలిపారు. రైతులు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని సమాజానికి, పర్యావరణాన్ని కాపాడాలని ఆకాంక్షించారు.