జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 3 పరీక్షల నేపథ్యంలో ఉద్యోగులంతా పరీక్షల నిర్వహణలో ఉంటారని దీని కారణంగా ప్రజావాణిని రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు.