ప్రముఖ వ్యాపారవేత్త టాటా గ్రూప్స్ వ్యవస్థాపకులు రతన్‌టాటా మృతి పట్ల మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎపి జితేందర్ రెడ్డి గురువారం సంతాపం వ్యక్తం చేశారు. రతన్‌టాటా మృతి పారిశ్రామిక రంగానికి తీరని లోటని అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.