జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు వివిధ కేసులలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తోట శ్రీనివాసరావు శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద కార్ అద్దాలు పగలకొట్టి రూ. 3, 60, 000 నగదు దొంగతనం చేశాడు. ఈ కేసులపై పోలీసులు విచారణ చేపట్టి, నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.