మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం గ్రూప్-3 పరీక్షకు ఓ అభ్యర్థి ఆలస్యంగా చేరుకుంది. గమనించిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య సకాలంలో పరీక్షా కేంద్రానికి తన బైక్ పై తీసుకెళ్లి పరీక్ష కేంద్రానికి చేర్చారు. అభ్యర్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి సహాయ చర్యలు అత్యంత ముఖ్యమైనవిని, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యను జిల్లా ఎస్పీ డి. జానకి ప్రశంసించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకోవాలని ఎస్పి సూచించారు.