రాజోలి మండలం పెద్ద ధన్వాడలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ పై ప్రజలు గత కొన్ని రోజులుగా విముఖత తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో తమ బాధను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజేయుడుకు తెలియచేశారు. వారి బాధను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బుధవారం జిల్లా కలెక్టర్ సంతోష్ ను కలిసి మాట్లాడారు. కంపెనీ ఏర్పాటు, దాని వల్ల కలిగే నష్టాలు, రైతులు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తదిదర అంశాలను గురుంచి చర్చించారు.