గ్రూప్-3 పరీక్షల రెండవ రోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డి. జానకి దారావత్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ సెక్షన్ అమలు చేయడం ద్వారా భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించబడునని ఎస్పీ జానకి తెలిపారు.