మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మలాద్ వేస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల దేవరకద్ర ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అస్లాం షేక్ తో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వివరాలను చర్చించామన్నారు.