మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటర్ జాబితాలో ఈ నెల 21 వరకు మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, మృతి చెందిన వారి పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు తొలగింపు, చిరునామా మార్పు, తప్పులను సరిదిద్దడం లాంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె తెలిపారు.