రైతులు వరి అమ్ముకోవాలంటే తమ సరైన పత్రాలు వెంబడి ఉంచు చూసుకోవాలని రైతులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూమి పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ధృవీకరణ పత్రం మొదలగునవి జీరాక్స్ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఈపత్రాలు కొనుగోలు నిర్వాహకులకు ఇస్తే సరైన సమయంలో డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.