దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం పల్లమర్రి గ్రామంలో శుక్రవారం చాట ఊరేగింపు కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వయంగా చాటను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వడ్డేమాన్ గ్రామానికి చేరుకున్నారు. వడ్డేమాన్ లో తయారు చేసిన పాదుకలను తీసుకొని కురుమూర్తి స్వామి దేవాలయానికి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.