దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం రామన్ పాడు సమీపంలోని ఎర్రగట్టు ఆలయ దగ్గర మైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మైసమ్మ ఆలయ ప్రహరీ నిర్మాణానికి తన నిధుల నుంచి రూ. 5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.