కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో నేడు ప్రధాన ఘట్టం ఉద్దాల ఉత్సవం. మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి కురుమూర్తి గుట్టకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. స్వామి వారి ఉద్దాల ఉత్సవం(పాదుకలు) వడ్డెమాన్ గ్రామం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు భక్తుల కోలాహలం మధ్య కురుమూర్తి కొండకు చేరుకుంటాయి. సాయంత్రం వరకు 5 లక్షల భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.