మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం శ్రీకురుమూర్తి స్వామి జాతర ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి ఈ నెల 11న సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా రానున్నారు.