మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అమ్మాపురంలో పేదల తిరుపతి గా పేరుందిన కురుమూర్తి స్వామిని ఆదివారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్బంగా స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఓ సీఎం కురుమూర్తిని దర్శించుకోవడం ఇదే తొలిసారి. దాదాపు నెల రోజుల పాటు కురుమూర్తి జాతర వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.