మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కురుమూర్తి స్వామి వారి దర్శనం కోసం, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల 10న (ఆదివారం) ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కురుమూర్తి జాతర మైదానంలో జిల్లా ఎస్పీ జానకి దారావత్, వివిధ శాఖల అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించారు.