విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. పినపాక మండలం జానంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. పాఠశాలలో మొక్కను నాటారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం అందుకున్న ఎంఈఓ వీరాస్వామిని సత్కరించారు.