మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వరంగల్ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషను సోమవారం తనిఖీ చేశారు. గోదావరి తీర ప్రాంతాల్లో మరింత నిఘా పెంచాలని సూచించారు. మన్యంలోని పోలీస్ కమ్యూనిటీ పోలీసింగ్ ను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. యువత అసాంఘిక కార్యకలాపాల వైపునకు మొగ్గు చూపకుండా చూడాలన్నారు.