మణుగూరు ఏరియా పీవీకాలనీలోని సింగరేణి నివాస గృహాలను అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. నివాస గృహాల్లో ఉంటున్న కార్మికులతో మాట్లాడారు. ఎలక్ట్రికల్, సివిల్ పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ నివాస గృహాలను గుర్తించి త్వరలో ఉద్యోగులకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక అధికారి శ్యామ్ సుందర్, వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు.