హైదరాబాద్ లో చదువుకుంటున్న ఆదివాసీ విద్యార్థులకు వసతిగృహ భవనాలను నిర్మించాలని కోరుతూ ఆదివాసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మణుగూరు ప్రజాభవన్ లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. పాపారావు మాట్లాడుతూ ఉన్నత విద్య చదివేందుకు హైదరాబాద్ వెళ్లిన ఆదివాసీ విద్యార్థులు నివాస గృహాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.