మణుగూరు నుండి ఏటూరునాగారం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని సామాజిక కార్యకర్త రవి బుధవారం ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని, వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని సామాజిక కార్యకర్త రవి కోరారు.