మణుగూరు 100 పడకల హాస్పిటల్ లో సోమవారం నుండి కంటి వైద్య పరీక్షలు నిర్వహించబడునని కంటి వైద్య అధికారి సంజీవరావు ఆదివారం తెలిపారు. గుండాల, మర్కోడు, కరకగూడెం, పినపాక, మంగపేట, మణుగూరు, అశ్వాపురం మండలాలలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారు సోమవారము నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.