మణుగూరులో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం పర్యటించారు. మండల తహశీల్దార్, ఎంపీడీవోతో జిల్లా కలెక్టర్ రెవెన్యూ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న కులగణన సర్వే వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కులగణన సర్వేను వేగవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.