డిసెంబర్లో నిర్వహించనున్న సీపీఐ శత జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య పేర్కొన్నారు. మణుగూరు పట్టణం మద్దులగూడెంలో బుధవారం రాత్రి నిర్వహించిన గ్రామ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంతో సంబంధం లేకుండా పేదల పక్షాన నిరంతరం పోరాడేది సీపీఐ మాత్రమేనన్నారు. అనంతరం 11 మందితో కూడిన నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు.