మణుగూరు పర్యాటకంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నటు కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. మణుగూరు పట్టణం చినరాయిగూడెంలోని గోదావరి ఒడ్డు ప్రాంతాన్ని కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చినరాయిగూడెం నుంచి పడవపై పర్ణశాలకు కొద్ది నిమిషాల్లోనే చేరుకోచ్చనే అంశంపై ఆరా తీశారు. తహసీల్దార్ రాఘవ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.