సింగరేణి క్రీడాకారులు ఆటల్లో సత్తాచాటి కోల్ ఇండియా స్థాయిలో పతాకం ఎగురవేయాలని మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్ సూచించారు. పీవీకాలనీలోని భద్రాద్రి క్రీడా మైదానంలో రెండు రోజులపాటు జరిగిన కంపెనీ స్థాయి హాకీ పోటీలు బుధవారం ముగిశాయి. పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.