హక్కుల సాధనకు ప్రజల పక్షాన పోరాటం సాగించే ప్రజాస్వామ్య, వామపక్ష వాదులపై దాడులు చేయడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. మణుగూరులో మంగళవారం నిర్వహించిన ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తున్న ఉద్యమకారులపై భాజపా ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెడుతూ అందరినీ అణచివేయాలని చూస్తుందన్నారు.