బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీలోని ప్రధాన సెంటర్లో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి మండల అధ్యక్షుడు పూలమాలతో నివాళులర్పించారు. దేశంలో ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించి, భూమిలేని పేదలకు భూములను పంచి విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు.