భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం శుక్రవారం బుర్గంపాడు గ్రామానికి చెందిన కొండా సురేంద్ర అనే యువకుడికి అవయవాలు దెబ్బతినడంతో ఖమ్మం లోని ప్రశాంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది అని తెలుసుకున్న చేయూత ట్రస్ట్ సభ్యులు యువకుడికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అక్షరాలా 11, 000/- రూపాయలు ఆర్ధిక సాయం చేశారు.