బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. రైతుల పండించిన ధాన్యంకు మద్దతు ధర ప్రకటించి క్వింటాకు రూ 500 బోనస్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.