ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం అశ్వాపురం మండల పరిధిలోని రామచంద్రాపురంలో జరుగుతున్న సీపీఎం మండల మహాసభకు ఆయన హాజరయ్యారు. మండలంలోని చాలా ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేక ఆదివాసీ, గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు.