తెలంగాణ ప్రభుత్వం జులైలో నిర్వహించిన డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం అశ్వాపురం మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలో విధుల్లో చేరారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ వీరాస్వామి వారికి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలోని ఉపాధ్యాయ సంఘాలైన పిఆర్టియు, యుటిఎఫ్ నాయకులు నూతన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.