అశ్వాపురం సీతమ్మ సాగర్ భూ నిర్వాసిత రైతుల సమస్యలపై పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం ఆర్డీవోకి దామోదర్ కి బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. సీతమ్మ సాగర్ పనుల్లో ధ్వంసం అయినా మోటర్లు, పైపులైన్లు వల్ల మిగిలిపోయిన భూములకు సాగునీటి సౌకర్యం లేదని మిగిలిన భూములకు సాగు నీటి సౌకర్యం కల్పించాలని ఆర్డీవోని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు ఉన్నారు.