అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా కలపను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు సోమవారం అశ్వాపురం ఎస్ఆర్ఆ సిద్ధబోయిన రమేష్ తెలిపారు. మండల కేంద్రంలో పక్కా సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు టాటా ఏసీ వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా, అందులో సుమారు 80 వేల విలువ గల కలప ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.