సీతారాంపురంలో ఈనెల 16న గ్రామానికి చెందిన సప్కా వీరన్న, సప్కారవి అనే వ్యక్తులపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు సప్కా పవన్ను అశ్వాపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు అశ్వాపురంలో సంచరిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం నిందితుడిని కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.