ఆళ్లపల్లి: పురుగుల మందు తాగి ఒకరి మృతి

69பார்த்தது
ఆళ్లపల్లి: పురుగుల మందు తాగి ఒకరి మృతి
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి చెందిన ఘటన ఆళ్లపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. కిచ్చెనపల్లి గ్రామానికి చెందిన గొగ్గెల లక్ష్మినారాయణ(40) కుటుంబ గొడవల నేపథ్యంలో బుధవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రతీశ్ తెలిపారు.

தொடர்புடைய செய்தி