పాల్వంచ మున్సిపాలిటీలో పని చేస్తున్న స్వచ్ఛ కార్మికులు బుధవారం ఏఐటీయూసీలో చేరారు. ఈ సంధర్బంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏఐటీయూసీలో చేరుతున్న కార్మికులకు కండవాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ కార్మికులు పాల్వంచ పట్టణాన్ని చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దునందుకు తీవ్ర కృషి చేస్తున్నారన్నారు. కార్మికులకు అండగా ఉంటానని తెలిపారు.