సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ సత్తుపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా కన్నయ్యగారి వీణాను నియమిస్తూ సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్తీ మక్కడ్ ఉత్తర్వులు జారీ చేశారు. సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్తీ మక్కడ్ నియమకపు ఉత్తర్వులను వీణా కు అందజేశారు. మహిళా సాధికారత కోసం సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ పని చేస్తుందని ఆర్తీ తెలిపారు.
భాదిత మహిళలు ఆపద సమయంలో రక్షణ పొందేందుకు సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులను సంప్రదించాలని, మహిళాలకు న్యాయ సహాయం సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తామని ఆర్తీ మక్కడ్ తెలిపారు. తనపై నమ్మకంతో తనకు కోఆర్డినేటర్ భాథ్యతలు ఇచ్చిన సఖీ జాతీయ అధ్యక్షురాలు రారియన్ సుష్మా, రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్తీ మక్కడ్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మహ్మద్ సల్మా కు వీణా కృతజ్ఞతలు తెలిపారు. భాదిత మహిళలులకు సఖీ ఎప్పుడు అండగా ఉంటుందని వీణా తెలియచేశారు. సఖీ ఆధ్వర్యంలో త్వరలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమలు ఏర్పాటు చేస్తున్నామని వీణా తెలిపారు. ఈ కార్యక్రమంలో సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భాధ్యులు కే. స్వాతి, ఎకాంబేశ్వరి, అడ్వకేట్ లావణ్య, ప్రియ, తదితరులు పాల్గొన్నారు.