భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జ్యుడీషియల్ స్టాంపులు కొరతపై కొత్తగూడెం బార్ ప్రెసిడెంట్ అనుబ్రోలు రాంప్రసాద్ రావు అధ్యక్షతన న్యాయవాదులు మంగళవారం కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా క్యాంపుల కొరత వలన న్యాయవాదులు మరియు కక్షిదారులు పడుతున్నటువంటి ఇబ్బందులను సబ్ రిజిస్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. సానుకూలంగా స్పందించిన సబ్ రిజిస్టర్ గారు తమ పై అధికారుల దృష్టికి ఇట్టి విషయాన్ని నివేదిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కే శామ్యూల్, తెల్లబోయిన రమేష్, చిన్ని కృష్ణ ఉప్పు అరుణ్, పాతూరి విఠల్ తదితరులు పాల్గొన్నారు.