కొత్తగూడెం నియోజకవర్గం పట్టణ పరిధిలో గల 20వార్డ్ మేదరబస్తీలో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ది విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గణేశుడిని పూజిస్తే అన్ని దేవతల అనుగ్రహం లభిస్తుందనీ భారత దేశంలో వినాయక చవితికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అన్నారు. ఈ పండగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం నాల్గోవ రోజున జరుపుకుంటారు. గజననుడిని ప్రాణ వనాద స్వరూపుడిగా, శబ్దబ్రమ్మ అకృతిగా ముద్దాల పురాణం, లోకరక్షకుడిగా గణేశ పురాణం, సమస్త లోకానికి అధరాశక్తిగా గణేష్ గీత చెప్తున్నాయి. దేవతల నుండి మానవుల వరకు ఎదుర్కొనే విజ్ఞాలను ప్రతికూల శక్తులను నివరించి వారు చేపట్టే కార్యాలు విజయతీరాలకు చేరేందుకు ఆయన కృప ఉపకరిస్తుందిని వేదవాక్కు. భక్తి శ్రద్దలతో వినాయకుడిని పూజిస్తే కోరుకున్న వారికి కొంగు బంగారమై కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడాని ఈ నవరాత్రులు కూడా భక్తితో పూజించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య తెలిపారు. ఈకార్యక్రమములో చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్, ప్రముఖ కాంట్రాక్టర్ కొటేశ్వరావు, బీసీ సెల్ పట్టణ నాయకులు పల్లపు వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏలూరి రాజేష్ కుమార్, లక్మిదేవిపల్లి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్, కాంగ్రెస్ నాయకులు వేలేటి వెంకటేశ్వర్లు, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్, కమిటీ సభ్యులు సురేష్, ధన్ రాజు, రాము, గౌస్, హైమద్, చింటూ, రాజు కళ్యాణ్, సతీష్, రాజేష్, ఋషి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.