జిల్లా కోర్టు కు తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా రక్షణ

3019பார்த்தது
జిల్లా కోర్టు కు తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా రక్షణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ ను బుధవారం తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ జంగయ్య మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మేరకు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగం హైకోర్టుతోపాటు వివిధ జిల్లా కోర్టుల్లో 730 కానిస్టేబుల్స్ ను నియమనించనున్నట్టు తెలిపారు. జిల్లా న్యాయమూర్తిని కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు సముదాయాన్ని రక్షణ ఏర్పాట్ల కోణంలో పరిశీలించి తగు విషయాల పై చర్చించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ ప్రెసిడెంట్ అనుబ్రోలు రాంప్రసాద్ రావు, ట్రేజరర్ మహ్మద్ సాదిక్ పాషా, పాతూరి విఠల్ పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி