సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ మణుగురు పట్టణ కార్యదర్శి గా ఆర్. ప్రమీలను నియమిస్తు సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్తీ మక్కడ్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నియమకపు ఉత్తర్వులు అందుకున్న ప్రమీల మాట్లాడుతూ మహిళ సాధికారత కోసం, ఆపద లో ఉన్న మహిళలకు రక్షణ అందించడం కోసం, సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ పని చేస్తుందని, తన పై నమ్మకం తో తనకు మణుగురు పట్టణ కార్యదర్శి గా భాధ్యులు అప్పచెప్పిన సఖీ జాతీయ అధ్యక్షురాలు సుష్మా రారియన్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్తీ మక్కడ్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మహ్మద్ సల్మా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లంకపల్లి కరుణ, కొప్పెర కవిత లకు ప్రమీల కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ & వెల్ఫేర్ ఫౌండేషన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అపద సమయం లో న్యాయ సహయం కోసం తమను సంప్రదించాలని ప్రమీల విజ్ఞప్తి చేశారు.