పినపాక ఈ బయ్యారం గోదావరి నుంచి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రహరీ గోడ వద్ద అక్రమంగా నిలువ చేసిన ఇసుక కుప్పలను సోమవారం పినపాక మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ తనిఖీ చేశారు. పంచనామా నిర్వహించి సీజ్ చేస్తామని వెల్లడించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణాపై నిఘా పెట్టామని తెలిపారు.