భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు గ్రామ సమస్యలను పరిష్కరించండి అని ఓ వినతి పత్రాన్ని అందచేశారు. పాల్వంచ మండల
కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు భూక్యా గిరి ప్రసాద్ తమ గూడెంలో ఉన్న సమస్యలను వెల్లడించారు. ముఖ్యంగా గ్రామానికి వలస వచ్చిన వారికి ఆధార్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ రాకపోవడం, వారి పిల్లల చదువుకి ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యేను వినతి పత్రం ద్వారా వేడుకున్నారు.